తెలంగాణ

telangana

ETV Bharat / crime

బైక్​ను తప్పించబోయి ప్రమాదం.. 13 మందికి తీవ్ర గాయాలు - road accident in kamareddy

బైక్​ను తప్పించబోయిన ఆటో.. కారును ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి వద్ద చోటు చేసుకుంది.

Road Accident
బైక్​ను తప్పించబోయి ప్రమాదం

By

Published : Nov 14, 2021, 9:48 PM IST

కామారెడ్డి జిల్లాకేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన ఆటో... కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండండతో అతన్ని హైదరాబాద్​కు తరలించారు. జిల్లా కేంద్రంలోని సరంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది.

ప్రమాదం జరిగిందిలా...

కామారెడ్డి నుంచి పొందుర్తి వెళ్తున్న ఆటో... ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:

Bus Fire accident: గరుడ బస్సులో మంటలు.. పొగ వస్తుందని చూసేలోపే..

ABOUT THE AUTHOR

...view details