తెలంగాణ

telangana

ETV Bharat / crime

దారి దోపిడీ కేసులో దొంగలు ఎవరు..? బాధితుడ్ని విచారిస్తున్న పోలీసులు - డబ్బులు

money
money

By

Published : Jan 7, 2023, 12:31 PM IST

Updated : Jan 7, 2023, 2:36 PM IST

12:25 January 07

వైన్‌షాపు యజమాని నుంచి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లిన దొంగలు

Liquor Shop Owner was robbed in Hyderabad : హైదరాబాద్​ వనస్థలిపురంలో దారిదోపిడి కేసులో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. మొదట తన దగ్గర నుంచి గుర్తుతెలియని దండగులు డబ్బులు లాకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదు చేయగా.. దీంతో పోలీసులు ఘటన స్థాలానికి వచ్చి చూడగా వాహనంలో డబ్బులు మొత్తం ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు బాధితుడ్ని విచారించగా పొంతన లేని సమాధానాలు ఇస్తున్నాడు.

ఇది జరిగింది: హైదరాబాద్​లోని వనస్థలిపురంలో భారీ దారి దోపిడీ జరిగింది. వనస్థలిపురంలో మద్యం షాపు నిర్వహిస్తున్న వెంకటరాంరెడ్డి నుంచి గుర్తు తెలియని దుండగులు 1.74 కోట్ల రూపాయలు దోచుకెళ్లారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం వెంకటరాం వనస్థలిపురంలో ఎం.ఆర్.ఆర్ బార్​ను నిర్వహిస్తున్నారు.

ఇవాళ వెంకట్రాం రెడ్డి రూ.2 కోట్లు తీసుకుని వెళ్తుండగా ఆయణ్ను కొందరు దుండగులు వెంబడించారు. దారి మధ్యలో అడ్డగించి ఆయన వద్ద ఉన్న నగదు లాక్కున్నారు. ఈక్రమంలో ఆయన ప్రతిఘటించడంతో రూ. 25లక్షలు కిందపడిపోయాయి. మిగతా నగదుతో దుండగులు పారిపోగా.. కింద పడిన డబ్బును బాధితుడు స్వాధీనం చేసుకున్నాడు.

అనంతరం వెంకటరాం రెడ్డి స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తన దగ్గర నుంచి రూ.2 కోట్ల రూపాయలు గుర్తుతెలియని దుండగలు దోచుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలికి వెళ్లి చూడగా వాహనంలోనే నగదు ఉన్నట్లు గుర్తించారు. యజమాని వెంకటరామిరెడ్డిని ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Jan 7, 2023, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details