నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. వట్టిమర్తి వద్ద కారు చోరీ చేసిన దొంగలు...చిట్యాల ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేశారు. వెలిమినేడులో ఇండీక్యాష్ ఏటీఎంను లూఠీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 7 లక్షలు చోరీ జరిగినట్లు గుర్తించారు.
దొంగల బీభత్సం.. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం - atm theft in nalgonda
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వెలిమినేడులో ఇండీక్యాష్ ఏటీఎంను లూటీ చేసిన దుండగులు.. చిట్యాల ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేశారు.
![దొంగల బీభత్సం.. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం thieves-tried-to-steal-cash-from-atm-at-chityal-in-nalgonda-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10541124-687-10541124-1612760025088.jpg)
చిట్యాలలో దొంగల బీభత్సం
మొదట దొంగిలించిన కారులో డీజిల్ అయిపోవడంతో.. రహదారిపై వదిలేసి మరో కారును ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిట్యాలలో దొంగల బీభత్సం
- ఇదీ చూడండి :ఏటీఎం చోరీకి యత్నించింది క్యాష్ లోడరే..