తెలంగాణ

telangana

ETV Bharat / crime

అయ్యప్ప స్వాముల ఇరుముడులను దోచుకెళ్లిన దొంగలు.. ఎక్కడంటే.? - అయ్యప్ప భక్తులపై దాడి దోపిడి దొంగలు దాడి

అయ్యప్ప భక్తుల ఇరుముడులను దోచుకెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాల జిల్లా మహానందిలో చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులోంచి స్వాముల ఇరుముడులు తీసుకుని పారిపోయినట్లు వారు తెలిపారు. ఘటనపై హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.

Thieves stole from Ayyappa Swamys
Thieves stole from Ayyappa Swamys

By

Published : Nov 29, 2022, 12:31 PM IST

వారు దోపిడీ దొంగలు.. వారి కన్ను అయ్యప్ప భక్తుల ఇరుముడులపై పడింది. ఇంకేముంది ఇరుముడినే దోచుకెళ్లారు. ఏపీలోని నంద్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహానంది- ఎంసీ ఫారం మధ్య చోరీ జరిగినట్లు స్వాములు తెలిపారు. కదులుతున్న బస్సులో నుంచి ఇరుముడులు దించేసిన దుండగులు వాటితో పారిపోయినట్లు అయ్యప్ప స్వాములు వెల్లడించారు. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details