దొంగలు ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం బొడ్డుగూడెం గ్రామంలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు.
వివాహిత మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన దొంగలు - యాదాద్రి జిల్లాలో చైన్ స్నాచింగ్
యాదాద్రి భువనగిరి జిల్లా బొడ్డుగూడెం గ్రామంలో చైన్ స్నాచింగ్ జరిగింది. వ్యవసాయ భూమి వద్దకు వెళుతోన్న ఓ మహిళను చిరునామా అడిగిన దొంగలు ఆమె మెడలోని నల్లపూసల తాడును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జిల్లాలోని బొడ్డుగూడెం గ్రామానికి చెందిన నక్క పున్నమ్మ గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్తోంది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి పర్రెపాడు గ్రామానికి ఎలా వెళ్లాలి అని అడిగాడు. ఆమె ఆ వివరాలు చెప్తుండగా ఆ వ్యక్తి బైక్ మీద నుంచి దిగి మెడలో ఉన్న బంగారపు నల్లపూసల గొలుసుని లాక్కొని... ఆమెను కిందకి నెట్టేసి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న అడ్డగూడూరు ఎస్సై మహేశ్వర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:కన్నబిడ్డపై మూడు నెలలుగా తండ్రి అత్యాచారం