తెలంగాణ

telangana

ETV Bharat / crime

Thieves Damaged ATM In Nizamabad : ఏటీఎం ఎత్తుకెళ్లి ధ్వంసం చేసిన దొంగలు - ATM destroyed in Nizamabad

నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ధర్పల్లిలోని ఇండీక్యాష్ ఏటీఎంలోకి అర్ధరాత్రి .. దొంగలు చొరబడ్డారు. నగదు యంత్రాన్ని ఎత్తుకెళ్లి పట్టణ శివారులోని పొలాల వద్ద ధ్వంసం చేసి వెళ్లిపోయారు.

Thieves Damaged ATM In Nizamabad
Thieves Damaged ATM In Nizamabad

By

Published : Jan 31, 2022, 11:57 AM IST

నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. ఎత్తుకెళ్లడమే కాదు.. దాన్ని ధ్వంసం చేసి నగదు కొల్లగొట్టారు. ధర్పల్లిలోని ఇండీక్యాష్ ఏటీఎంలోకి ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. ఏటీఎంలోని నగదు తీసేందుకు ప్రయత్నించారు. ఎంతకీ నగదు రాకపోవడం వల్ల యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. పట్టణ శివారులోని పొలాల వద్దకు యంత్రాన్ని తీసుకువెళ్లి దాన్ని ధ్వంసం చేశారు. అందులో ఉన్న నగదును తీసుకొని పరారయ్యారు.

ఏటీఎం ధ్వంసం..

ఇవాళ ఉదయం ఓ రైతు తన పొలం వద్దకు వెళ్లే సరికి.. గట్టుపైన ఏదో యంత్రం ధ్వంసమైన స్థితిలో ఉండటం గమనించాడు. పక్కన పొలాల్లో ఉన్న రైతులను పిలిచి చూపించగా.. వాళ్లు ఆ యంత్రం ఏటీఎం అని గుర్తించారు. చుట్టుపక్కల నగదేమైనా పడిందేమోనని వెతికారు. ఎక్కడా కనిపించకపోయే సరికి ఎవరో ఏటీఎంను ఎత్తుకొచ్చి.. డబ్బు దోచుకెళ్లారని గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అందుకే ఎత్తుకెళ్లారు..

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ధ్వంసమైన ఏటీఎంను పరిశీలించారు. ఇండీక్యాష్ ఏటీఎం సెంటర్​కు వెళ్లారు. అక్కడ సీసీకెమెరా ఉండటం గమనించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details