తెలంగాణ

telangana

ETV Bharat / crime

దోపిడీ దొంగల బీభత్సం.. దారి కాచి.. కళ్లలో కారం కొట్టి హత్య - చిత్తూరులో దంపతులపై దాడి

ATTACK ON COUPLE IN CHITTOOR: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కార్తిక నోములు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న దంపతులపై అతి కిరాతకంగా దాడి చేశారు. భర్త కళ్లలో కారం కొట్టి దారుణంగా హతమార్చారు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా వెంటాడి హత్య చేశారు.

ATTACK ON COUPLE
ATTACK ON COUPLE

By

Published : Nov 1, 2022, 9:13 PM IST

దోపిడీ దొంగల బీభత్సం.. దారి కాచి.. కళ్లలో కారం కొట్టి

ATTACK ON COUPLE IN CHITTOOR: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో దోపిడీ దొంగలు దారుణానికి తెగించారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై దాడి చేశారు. కళ్లలో కారంకొట్టి.. భర్తను హతమార్చారు. భార్య వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బత్తలాపురానికి చెందిన దామోదర్‌, పెనుగొలకల గ్రామానికి చెందిన అనురాధకు.. ఏడాది క్రితం వివాహమైంది. కార్తికమాసం నోములు చేసుకునేందుకు ఇద్దరూ పెనుగొలకలకు వెళ్లారు.

తిరిగి ద్విచక్రవాహనంపై బత్తలాపురం వస్తుండగా.. ఇటుక నెల్లూరు-తుర్లపల్లె మార్గంలో ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని అడ్డుకున్నారు. దామోదర్‌ కళ్లలో కారంపొడి చల్లి.. అతనిపై దాడికి యత్నించారు. అప్పుడే ఆ మార్గంలో వస్తున్న వీరప్పల్లె వీఆర్వో శంకరప్ప చూసి.. ఊర్లోకి పరుగులు తీశారు. గ్రామస్థుల్ని వెంటబెట్టుకుని.. ఘటనాస్థలికి వచ్చాడు. ఈలోపే దామోదర్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

దామోదర్‌ దంపతులు తప్పించుకునే ప్రయత్నం చేసినా.. దుండగులు వదలకుండా వెంటాడారు. అతని చేతి వేళ్లకున్న ఉంగరాలు లాక్కొని.. మిగతా నగల కోసం బ్యాగు లాక్కున్నారని, అందులోని దుస్తులు చిందరవందర చేశారని.. దామోదర్​ భార్య అనురాధ తెలిపారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలిలో విచారణ చేపట్టారు. ఇది దోపిడీ దొంగల పనా? లేదంటే పరిచయస్తులెవరైనా పాతకక్షలతో దాడి చేశారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details