కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు మండలాల్లో జరిగిన చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి వెండి ఆభరణాలు, నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
దొంగల అరెస్ట్.. ఆభరణాలు, నగదు స్వాధీనం - తెలంగాణ వార్తలు
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు మండలాల్లో దొంగతనాలు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి వెండి ఆభరణాలు, నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని చొప్పదండి మండలం రుక్మాపూర్, గుమ్లాపూర్, రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామాల్లో ఆభరణాలు, నగదును అపహరించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆర్నకొండ గ్రామంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వేలిముద్రల నమూనాలతో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కూలీ పని చేసుకునే నిందితులు ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. నిందితుల వివరాలను కరీంనగర్ అడిషనల్ డీసీపీ చంద్రమోహన్ వెల్లడించారు. కరీంనగర్ ఏసీపీ విజయసారథి, సీఐ నాగేశ్వరరావు, ఎస్సై వంశీకృష్ణ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు.