హైదరాబాద్ మియాపూర్లోని ఇళ్లల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరి నుంచి 35తులాల బంగారం, 20తులాల వెండి ఆభరణాలతోపాటు 20వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
సీసీ కెమెరాల ఆధారంగా..
హాఫీజ్‌పేటకు చెందిన మహ్మద్ మోయిజ్, మహ్మద్ ఇబ్రహీంలు వరుసగా ఆరు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారని డీసీపీ వివరించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా.. మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో గతేడాది నవంబర్ 20 నుంచి ఈ ఏడాది జనవరి 18 వరకు లూటీలు చేశారన్నారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామన్నారు. చోరీలు జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశామన్నారు.