కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు చేతివాటాన్ని(Thief at Bjp meeting) ప్రదర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. భాజపా మీటింగ్ జరుగుతున్న సమయంలో దొంగలు తమ పనితనం ప్రదర్శించారు. దొంగలు ఒకరి వద్ద నుంచి పర్సుని దొంగిలించారు.
Thief in Bjp meeting: భాజపా సభలో దొంగ చేతివాటం.. చితక్కొట్టిన ప్రజలు - Telangana latest updates
రాజకీయ సమావేశాలు నిర్వహిస్తుండగా ఈ మధ్య దొంగలు (Thief at Bjp meeting) రెచ్చిపోతున్నారు. ఇదే అదునుగా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరూ బిజీగా ఉన్న సమావేశంలో తమ పనిని సైలెంట్‌గా చేసుకుంటూ వెళుతున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డిలో చోటుచేసుకుంది.
దొంగ చేతివాటం
ఇంకొకరి వద్ద నుంచి సెల్‌ఫోన్ దొంగతనం చేస్తుండగా వారిని గమనించిన స్థానికులు పట్టుకొని చోరుడిని చితకబాది స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కామారెడ్డి సీఐ మధుసూదన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల యాదాద్రి జిల్లాలో ఇదే తరహాలో దొంగతనాలు జరిగాయి. ఏకంగా రాజకీయ నాయకుల పర్సును కొట్టేసిన ఘటనలు ఉన్నాయి.
ఇదీ చూడండి:రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత... తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ