పటాన్చెరు ఠాణా పరిధిలోని శాంతినగర్ కాలనీలో బాలకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి బాలకృష్ణ ఇంటి తలుపునకు గడియపెట్టకుండా పడుకున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన దొంగలు తలుపులు తెరిచి ఉండటం గమనించారు. ఇద్దరు లోపలికి ప్రవేశించి ఆ ఇంట్లో కలియ తిరిగారు. కోటి ఆశలతో లోపలికి వచ్చిన వారికి 4 చరవాణులు తప్ప ఏవీ దొరకలేదు. దీంతో అవి తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయారు.
తెల్లవారాక ఇంట్లో చరవాణులు కన్పించకపోవడంతో బాలకృష్ణ సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇద్దరు దొంగలు ఇంట్లో తిరుగుతున్నట్లు ఫుటేజీలో గుర్తించారు. వెంటనే దొంగిలించిన చరవాణికి ఫోన్ చేయగా ఓ అపరిచిత వ్యక్తి లేపాడు.