Thief Caught At Nunna: ఏపీలోని విజయవాడ శివారు నున్నలో బ్లేడ్ బ్యాచ్ కలకలం సృష్టించారు. పాల ఫ్యాక్టరీలో పనిచేసే కూలీల వద్ద నుంచి రూ.3 వేలు లాక్కొని.. ద్విచక్రవాహనంపై పారిపోయే ప్రయత్నం చేశారు. జనం వెంబడించటంతో ఓ దొంగ బండిపై నుంచి కింద పడి.. తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న మంచినీటి చెరువులోకి దూకాడు. చెరువును చుట్టుముట్టిన జనం.. చెరువులోకి దిగి దొంగను బంధించారు. అనంతరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Thief Caught At Nunna: తప్పించుకోబోయి చెరువులో దూకిన దొంగ.. చివరికి.. - దొరికిన దొంగ
Thief Caught At Nunna: ఏపీలోని విజయవాడ శివారు నున్నలో దొంగతనానికి వచ్చిన బ్లేడ్ బ్యాచ్ ముఠా సభ్యుడికి వింత పరిస్థితి ఎదురైంది. కూలీల నుంచి డబ్బు లాక్కొని వెళ్లే క్రమంలో దొంగను జనం వెంబడించారు. ఏం చేయాలో తెలియని దొంగ.. పక్కనే ఉన్న చెరువులో దూకేశాడు.
విజయవాడలో చెరువులో దూకిన దొంగ
rowdy sheeter: పట్టుబడిన దొంగ... రౌడీషీటర్ ఏబేలుగా పోలీసులు గుర్తించారు. మరో ఆరుగురు దొంగలు పరారైనట్లు వెల్లడించారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
Last Updated : Dec 10, 2021, 10:44 PM IST