తెలంగాణ

telangana

ETV Bharat / crime

సెంచరీ దొంగకు కేపీహెచ్​బీ పోలీసుల అరదండాలు - తాళం వేసిన ఇళ్లలో చోరీలు

రాత్రివేళల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా.. వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి భారీగా బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

Thief arrested Thefts in locked houses in hyderabad
తాళం వేసిన ఇళ్లలో చోరీలు.. గజదొంగ అరెస్ట్

By

Published : Feb 15, 2021, 8:58 PM IST

హైదరాబాద్​తో పాటు పలు పరిసర ప్రాంతాల్లో.. సుమారు వంద చోరీలకు పాల్పడిన ఓ గజదొంగను కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 10.2 లక్షల విలువైన బంగారు, 95 తులాల వెండి ఆభరణాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు.. జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం..

అమీర్​పేట్​ ఎల్లారెడ్డి గూడకు చెందిన మహమూద్ ఇబ్రహీం సిద్దీఖీ(58) తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఈ చోరీలు చేసేవాడు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు, సంగారెడ్డి జిల్లా, నెల్లూరు తదితర ప్రాంతాల్లో 87చోరీలకు పాల్పడ్డాడు. ఆయా కేసుల్లో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. 2019లో జైలు నుంచి విడుదలయ్యాక.. కర్ణాటకలోని బీదర్​కు తన మకాం మార్చాడు.

వారాంతాలలో బీదర్ నుంచి బస్సులో కేపీహెచ్​బీ, చందానగర్, పఠాన్ చెరువు ప్రాంతాలకు వస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించేవాడు. అర్ధరాత్రి తాళాలు‌ పగులగొట్టి ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడేవాడు.‌ ఈ విధంగా మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో 11చోరీలకు పాల్పడ్డాడు.

ఇబ్రహీం సిద్దీఖీని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డులు అందజేశారు.

ఇదీ చదవండి:'వినియోగదారుల్లా వస్తారు... ఆభరణాలు దోచేస్తారు'

ABOUT THE AUTHOR

...view details