దొంగతనాలు చేసి జైలుకు వెళ్లివచ్చి మళ్లీ అదేపని మొదలు పెట్టిన నిందితుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలో పలు ఇళ్లలో దొంగతనాలు చేసిన గారిపల్లి సత్యనారాయణ అనే దొంగను విచారించగా గతంలో సిద్దిపేటలో 34 ఇళ్లలో చోరీ చేసినట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు.
ఘరానా దొంగ అరెస్ట్.. నగలు స్వాధీనం - తెలంగాణ వార్తలు
దొంగతనాలు చేసి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి మళ్లీ చోరీలకు పాల్పడుతుండగా మల్కాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద ఉన్న నగలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో సిద్దిపేటలో 34 ఇళ్లలో చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘరానా దొంగ అరెస్ట్, మల్కాజిగిరి పోలీసులు
జైలు నుంచి వచ్చి హైదరాబాద్, మల్కాజిగిరిలో మూడు దొంగతనాలు చేశాడని తెలిపారు. నిందితుడి నుంచి సుమారు రూ.లక్ష విలువగల నగలను స్వాధీనం చేసుకొని.. రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:వ్యాపారి ఇంట్లో రూ.40 లక్షలు విలువచేసే వజ్రాలు, జాతిరత్నాలు చోరీ