నల్లమల అడవుల్లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ రేంజ్ పరిధిలోని జీలువాయి కుంట నుంచి ఫరహాబాద్ వరకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
మరోసారి నల్లమలలో అగ్నిప్రమాదం - తెలంగాణ తాజా వార్తలు
నల్లమలలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. వరుస అగ్నిప్రమాదాలకు పర్యాటకులు కూడా ఓ కారణమని అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోకి వచ్చే వారు వంటలు చేయడం, ధూమపానం చేసిన తర్వాత సిగరెట్లను అలానే పడేయడం వల్ల మంటలు అంటుకుంటున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
మరోసారి నల్లమలలో అగ్నిప్రమాదం
పర్యాటకుల వల్లనే అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోకి వచ్చే వారు వంటలు చేయడం, ధూమపానం చేసిన తర్వాత సిగరెట్లను అలానే పడేయడం వల్ల మంటలు అంటుకుంటున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అడవులను రక్షించేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని అధికారులు కోరుతున్నారు.
ఇవీచూడండి:నల్లమల అడవుల్లో ఆందోళన కలిగిస్తున్న అగ్నిప్రమాదాలు