హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసి నగర్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు. ఉదయం మూడు గంటల ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. లాక్డౌన్ కారణంగా మూడు ఇళ్ల యజమానులు తాళాలు వేసి తమ స్వగ్రామాలకు వెళ్లారు. ఈ మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టిన చోరులు.. ఓ ఇంట్లో సెల్ ఫోన్ను దొంగిలించారు. మరో రెండిళ్లలో ఏం దొరక్కపోవడం వల్ల వెనుదిరిగి వెళ్లిపోయారు.
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా.. దొంగతనాలు - హైదరాబాద్ తాజా దొంగతనాలు
లాక్డౌన్ కారణంగా సొంత గ్రామాలకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు యత్నించారు ముగ్గురు వ్యక్తులు. ఓ ఇంట్లో సెల్ఫోన్ చోరీ చేయగా.. మరో రెండిళ్లలో ఏం దొరక్క వెనుదిరిగి వెళ్లిపోయారు.
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా.. దొంగతనాలు
ఈ రోజు ఉదయం ఇంటికి వచ్చిన యజమానికి తాళం పగులగొట్టి ఉండటం కనపడింది. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూసేసరికి సెల్పోన్ కనిపించలేదు. దొంగతనం జరిగిందని గ్రహించిన యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వీటి ఆధారంగా దొంగతనానికి పాల్పడింది ముగ్గురు వ్యక్తులని తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి :మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం