తెలంగాణ

telangana

ETV Bharat / crime

వికారాబాద్​లో అమ్మవారి కిరీటం అపహరణ - Hundi theft case in kulkacharla

Thefts in Kulkacharla Mandal of Vikarabad District: ఈరోజుల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే దుండగులు ఏకంగా గుడిలో ఉన్న అమ్మవారి కిరీటం, హుండీని దొంగలించారు. వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల మండంలో రెండు చోట్ల దొంగతనాలు జరిగాయి. ఈ రెండు ఒకే ముఠా చేసిందా? లేదా వేరు వేరు ముఠాలు చేశారా? అనే కోణంలో దర్యాప్తు చెేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Thefts in Kulkacharla Mandal of Vikarabad District
వికారాబాద్​లో అమ్మవారి కిరీటం అపహరణ

By

Published : Dec 27, 2022, 2:55 PM IST

Thefts in Kulkacharla Mandal of Vikarabad District: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో రెండు వేరువేరు చోట్ల దొంగతనాలకు దుండగులు పాల్పడ్డారు. శ్రీ పాంబండ రామలింగేశ్వర ఆలయం వెనకాల ఉన్న అమ్మవారి ఆలయంలోని అర్థరాత్రి రెండు గంటల సమయంలో.. కారులో నలుగురు వ్యక్తులు వచ్చి అమ్మవారి ఆలయం తలుపు తాళం విరగొట్టి ఆలయంలోకి వెళ్లారు. ఆలయంలో అమ్మవారి వెండి కిరీటం దొంగిలించారు.

ఈ ఘటన అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో జరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కారు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో కారు ఎవరది అనేది ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. ఇదే సమయంలో కుల్కచర్ల మండలంలోని దాస్య నాయక్ తండాలో సేవాలాల్ ఆలయంలో హుండీని దుండగలు ఎత్తుకెళ్లారు. ఈ రెండు చోట్ల జరిగిన దొంగతనాల్లో పోలీసులు వెేలి ముద్రలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details