Theft in Police Station: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కె.కోటపాడు పోలీస్‌స్టేషన్‌లో గంజాయి చోరీ కలకలం రేపింది. సీజ్ చేసి భద్రపరిచిన గంజాయిలో కొంత భాగాన్ని కానిస్టేబుల్ మాయం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్‌తో పాటు ఏ.కోడూరుకు చెందిన శెట్టి సందీప్ కుమార్ని అరెస్ట్ చేయనున్నారు. చోరీ సొత్తు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ముగ్గురు మైనర్లు సహకరించినట్టు పోలీసులు తెలిపారు.
పోలీస్ స్టేషన్లో గంజాయి చోరీ.. ఇంతకీ దొంగ ఎవరంటే? - ganja theft from police station
Theft in Police Station: ఏదైనా పోగొట్టుకుంటే మనం పోలీసు స్టేషన్కి వెళ్తాం. కానీ పోలీసు స్టేషన్లో భద్రపరిచినదే పోతే ఎవరి దగ్గరకి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు పోలీసులకి ఇటువంటి పరిస్థితే ఎదురైంది. సీజ్ చేసి.. భద్రపరచి.. స్టేషన్లో పెట్టిన గంజాయి మాయమైంది. ఏకంగా 200 కిలోలు మాయం అవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేసి దొంగను కనిపెట్టారు.
kotapahad police station