తెలంగాణ

telangana

ETV Bharat / crime

శివారాత్రి రోజే రెండు ఆలయాల్లో చోరీ - కుసుమ సముద్రం ఆలయాల్లో చోరీ

మహా శివరాత్రి రోజే శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో గుర్తు తెలియని వక్తులు చోరీ చేశారు. హుండీలు పగులగొట్టి సొత్తు, గుడిలోని పంచలోహ విగ్రహాలు దొంగిలించారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటన వికారాబాద్​ జిల్లాలో జరిగింది.

Theft in two temples on Shivratri day at kusuma samudram
శివారాత్రి రోజే రెండు ఆలయాల్లో చోరీ

By

Published : Mar 12, 2021, 4:16 PM IST

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కుసుమ సముద్రం గ్రామంలోని దేవాలయాల్లో దొంగతనం జరిగింది. శివరాత్రి రోజే శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు.. హుండీలు పగులగొట్టి దేవుడి కానుకలు, గుడిలోని పంచలోహ విగ్రహాలు చోరీ చేశారు.

శివరాత్రి పర్వదినం రోజు గ్రామస్థులు ఉపవాస దీక్షలు ముగించుకుని.. భజనలు చేసి తమ ఇళ్లకు వెళ్లిన తర్వాత దొంగలు చోరీకి పాల్పడ్డారని తెలిసింది. ఉదయం గుడికి వచ్చిన గ్రామస్థులు గుడి తలుపులు, హుండీ పగుల కొట్టి ఉండటం చూసి షాక్​ అయ్యారు. గుడిలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :పంజాగుట్ట పైవంతెన వద్ద అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details