రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. రూ. 2 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. మరో ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు.
రెచ్చిపోయిన దొంగలు.. రెండు ఇళ్లను ఊడ్చేసి.. మరో ఇంట్లో..!
వనస్థలిపురంలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. మరో ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. రూ.2 లక్షల నగదు, 10 తులాల బంగారంతో ఉడాయించారు.
రెచ్చిపోయిన దొంగలు.. రెండు ఇళ్లను ఊడ్చేసి.. మరో ఇంట్లో..!
ఇళ్లల్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.