Theft in three Temples : మేడ్చల్ జిల్లా సూరారంలోని మూడు ఆలయాల్లో చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి పంచలోహ విగ్రహాలు, నగదు ఎత్తుకెళ్లారు. లక్ష్మీనగర్‌లోని కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయానికి తెల్లవారుజామున అర్చకులు వచ్చి చూసేసరికి ఉత్సవ పంచ లోహ విగ్రహాలు కనిపించలేదు. ఆలయ తాళాలు పగలగొట్టి ఆరు పంచలోహ విగ్రహాలు, హుండీలోని నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
Theft in three Temples : మూడు ఆలయాల్లో చోరీ.. విగ్రహాలు, నగదు అపహరణ - తెలంగాణ వార్తలు
Theft in three Temples : మేడ్చల్ జిల్లాలోని మూడు ఆలయాల్లో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి విగ్రహాలు, నగదు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించారు.
మూడు ఆలయాల్లో చోరీ
పక్కనే ఉన్న రామాలయం, పోచమ్మ గుడిలోనూ దుండగులు చోరీ చేశారు. రెండు వెండి విగ్రహాలు, హుండీలోని నగదు అపహరించారు. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.లక్ష వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:congress party membership : త్వరలోనే జిల్లాల పర్యటనకు టీపీసీసీ చీఫ్ రేవంత్