తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆలయంలో హుండీలనే ఎత్తుకెళ్లారు..! - theft in temple news

ఆలయంలో ఉండాల్సిన హుండీలు ఊరి అవతల కనిపించాయి. అవాక్కైన గ్రామస్థులు ఎందుకా అని గమనిస్తే... అది దొంగల పని అని తేలింది. ఎవరికి తెలియకుండా దొంగిలించామనుకున్న చోరులు.. సీసీ టీవీకి పోజులిచ్చామని తెలిసిందో.. లేదో.. మరి?

theft-in-temple-at-korutla-mandal-jagithyala-district
చోరులు.. ఆలయంలోని హుండీలనే ఎత్తుకెళ్లారు..!

By

Published : Jun 16, 2021, 12:33 PM IST

ఆలయంలోని హుండీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లడం చూశాం..! కానీ ఏకంగా హుండీలనే ఎత్తుకెళ్లిన చోరులను మాత్రం... ఇక్కడే చూస్తున్నాం. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

చోరులు.. ఆలయంలోని హుండీలనే ఎత్తుకెళ్లారు..!

గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో అర్ధరాత్రి తాళం పగులగొట్టి రెండు హుండీలను దొంగలు భుజాలపై ఎత్తుకెళ్లారు. ఊరి చివర వాటిని పగులగొట్టి అందులోని డబ్బులను దోచుకెళ్లారు. ఖాళీ హుండీలను అక్కడే పడడంతో అసలు విషయం తెలిసింది. హుండీలలో సుమారు రూ. లక్షకు పైనే డబ్బులు ఉంటాయని గ్రామస్థులు తెలిపారు. ఈ దొంగతనంలో ముగ్గురు దొంగలు ఉన్నట్లు ఆలయం వద్ద ఉన్న సీసీ ఫుటేజీలో రికార్డ్​ అయ్యింది. ఎవరికి తెలియకుండా దొంగతనం చేశామనుకున్న చోరులు.. సీసీ కెమెరాలో చిక్కారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి: Delta Variant: డెల్టా వైరస్​ రెండు నెలల్లో ఎలాగైనా మారొచ్చు!

ABOUT THE AUTHOR

...view details