తెలంగాణ

telangana

ETV Bharat / crime

తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ... పోలీసుల అదుపులో నిందితుడు - తిరుపతి తాజా వార్తలు

Srivari Parakamani: ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చోరీకి పాల్పడినట్లు తితిదే అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా అధికారులు నిందితుడిని జాడను కనిపెట్టారు. ఈ మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

Srivari Parakamani
శ్రీవారి పరకమణి

By

Published : May 10, 2022, 6:08 PM IST

Srivari Parakamani: ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఏపీలోని శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీకి పాల్పడినట్లు తితిదే అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించిన అధికారులు... తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను.. మంగళవారం ఉదయం మీడియాకు వెల్లడించారు.

ఈనెల 7వ తేదీన ఉదయం 10:30 గంటల సమయంలో చోరీ జరిగిందని తెలిపారు. నిందితుడు రూ.20 వేల నగదును అపహరించి ఆలయం నుంచి బయటకు వెళ్తున్న సమయంలో విజిలెన్స్ సిబ్బంది తనిఖీల్లో పట్టుబడ్డారని సీఐ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తిరుమల విజిలెన్స్ అధికారుల విచారణలో 20 వేల నగదును అపహరించానని నిందితుడు ఒప్పుకున్నట్లు సీఐ తెలియజేశారు.

శ్రీవారి పరకామణిలో చోరీ..పోలీసుల అదుపులో నిందితుడు..

ఇవీ చదవండి:Student Died: పరీక్ష కేంద్రం వద్ద గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి

ABOUT THE AUTHOR

...view details