Theft in temple: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో దొంగలు పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఆలయం తలుపులు పగులగొట్టిన దుండగలు గుడిలోకి ప్రవేశించారు. హుండీని కూడా పగులగొట్టి అందులో ఉన్న డబ్బును, స్వామి వారి ఆభరణాలను చోరీ చేశారు. మొత్తం 5తులాల బంగారం, 35కిలోల వెండి ఆభరణాలతో పాటుగా రూ.45వేల విలువగల యూఎస్ డాలర్లు హుండీలో ఉన్న డబ్బు పోయినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
ఉదయం గుడికి వెళ్లిన అర్చకుడు ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.