Theft In Retired Dsp House: విశ్రాంత డీఎస్పీ ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్లో చోటుచేసుకుంది. రిటైర్డ్ డీఎస్పీ నివాసంలో 12 బంగారు గాజులు దొంగతనానికి గురయ్యాయి. వీటి విలువ సుమారు రూ.లక్షా 75వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంట్లో పనిచేసే మనుషులపై అనుమానం ఉందని బాధితుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని శ్రీనికేతన్ కాలనీలో విశ్రాంత డీఎస్పీ జూపల్లి లక్ష్మణ్ రావు నివాసముంటున్నారు.
Theft In Retired Dsp House: విశ్రాంత డీఎస్పీ ఇంట్లో చోరీ... వారిపైనే అనుమానం! - Theft In Retired Dsp House
Theft In Retired Dsp House: హైదరాబాద్ బంజారాహిల్స్లో విశ్రాంత డీఎస్పీ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో 12 బంగారు గాజులు దొంగతనానికి గురయ్యాయి.
అతని నివాసంలో విజయవాడకు చెందిన నర్సమ్మ, నరసింహ దంపతులు గత మూడేళ్లుగా పనిచేస్తున్నారు. ఈనెల 18న ఇంట్లోని బీరువాలో దాచిపెట్టిన మూడున్నర తులాల బరువు గల 12 బంగారు గాజులు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులందరినీ వాకబు చేసినట్లు జూపల్లి లక్ష్మణ్ రావు తెలిపారు. చివరికి పని మనుషులను ఆరా తీయగా పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేశారని పేర్కొన్నారు. చివరికి ఎవరికి చెప్పకుండా తమ సొంతూరుకు వెళ్లిపోయారని... వారిపైనే అనుమానం ఉందని లక్ష్మణ్ రావు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: