తెలంగాణ

telangana

ETV Bharat / crime

అమ్మవారి ఆలయాల్లో చోరీ... రెండేళ్లలో ఇది నాల్గోసారి! - తెలంగాణ వార్తలు

మేడ్చల్​-మల్కాజిరిగి జిల్లాలోని చర్లపల్లి శ్రీ నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ ఆలయాల్లోని హుండీలను దుండగులు దోచుకున్నారు. ఈ ఆలయాల్లో రెండేళ్లలో నాల్గుసార్లు చోరీ జరగడం గమనార్హం. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందని స్థానికులు ఆరోపించారు.

theft-in-nalla-pochamama-temple-and-renuka-ellamma-temple-at-charlapally-in-medchal-malkajgiri-district
అమ్మవారి ఆలయాల్లో చోరీ... రెండేళ్లలో నాల్గోసారి!

By

Published : Mar 6, 2021, 1:26 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి ఐజీ కాలనీలోని శ్రీ నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ ఆలయాల్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి హుండీలను ధ్వంసం చేసి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులను దోచుకున్నారు. రెండేళ్లలో నాల్గుసార్లు దొంగతనం జరిగిందని స్థానికులు తెలిపారు.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పుస్తకోద్యమం!

ABOUT THE AUTHOR

...view details