Theft in Forum Mall: కూకట్పల్లి కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో ఉన్న సుజనా ఫోరం మాల్లో దొంగతనం జరిగింది. మాల్ తాళాలు పగలగొట్టి శనివారం రాత్రి లోపలికి ప్రవేశించిన దుండగుడు.. రెండో అంతస్తులోని సిల్వర్ షైన్స్ షాపులో సుమారు రూ. 8 లక్షల విలువైన వెండి నగలను దొంగిలించాడు. రోజు మాదిరిగానే నిన్న రాత్రి యజమాని దుకాణానికి తాళాలు వేసి.. ఇంటికి వెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. రాత్రి దొంగ దుకాణం తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది.
Theft in Forum Mall: ఫోరమ్ మాల్లో చోరీ.. ఏం దొంగిలించారంటే? - ఫోరమ్ మాల్లో చోరీ
Theft in Forum Mall: కూకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుజనా ఫోరం మాల్లో చోరీ జరిగింది. శనివారం రాత్రి మాల్లోని రెండో అంతస్తులో ఉన్న షాపులో సుమారు రూ. 8 లక్షల విలువ చేసే ఆభరణాలను దొంగ ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
![Theft in Forum Mall: ఫోరమ్ మాల్లో చోరీ.. ఏం దొంగిలించారంటే? Theft in Forum Mall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15164150-50-15164150-1651390845209.jpg)
Theft in Forum Mall
ఉదయం విషయం తెలుసుకున్న యజమాని పోలీస్ స్టేషన్కి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గతంలో అదే మాల్లోని ఓ దుకాణంలో పని చేసి మానేసిన మాజిద్ అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:అతివేగంతో బోల్తా కొట్టిన కారు.. భారీగా బయటపడిన గంజాయి