తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడి నగదు, బంగారం దోచుకెళ్లిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. పట్టణంలోని సంతోశ్నగర్ కాలనీకి చెందిన సలీం అనే వ్యక్తి స్థానికంగా క్రీడా దుస్తుల విక్రయ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లారు. తిరిగి 26న రాత్రి ఇంటికి రాగా తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూశారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ.. నగదు, బంగారం అపహరణ - నల్గొండ జిల్లా తాజా వార్తలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. 3 తులాల బంగారం, రూ.8 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
![తాళం వేసిన ఇంట్లో చోరీ.. నగదు, బంగారం అపహరణ Theft in a locked house .. Cash and gold stolen in Nalgonda district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10800210-843-10800210-1614422969306.jpg)
తాళం వేసిన ఇంట్లో చోరీ.. నగదు, బంగారం అపహరణ
ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి అందులోని రూ.8 లక్షల నగదు, 3 తులాల బంగారం అపహరించినట్లు గుర్తించారు. వెంటనే మిర్యాలగూడ 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి నెలలో అల్లుని వివాహ వేడుక ఉందని... దాని కోసం డబ్బును ఇంట్లో ఉంచినట్లు యజమాని సలీం తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పట్టభద్రుల పోరులో విజయమే లక్ష్యంగా భాజపా వ్యూహం