మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్ పరిధి కేశవ్‌నగర్‌లోని ఓ ఇంట్లో భారీ చోరి జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు ప్రవేశించి.. సుమారు ముప్పై లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి... 45 తులాల బంగారం అపహరణ
తాళం వేసి ఉన్న ఇంటికి దొంగలు కన్నం వేశారు. సుమారు ముప్పై లక్షల విలువైన బంగారు, వెండి, నగదును దొంగలించారు. ఈ ఘటన నేరేడ్మెట్ పరిధిలోని కేశవ్‌నగర్‌లో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నేరేడ్మెట్లోని కేశవ్‌నగర్‌లో అనసూయ అనే మహిళ నివాసముంటుంది. ఆరోగ్యం బాగోలేదని ఈ నెల 1వ తేదీన ఆరోగ్యం బాగోలేదని... ఆమె చిన్న కుమారుడు సుధాకర్ వద్దకు వెళ్లింది. సోమవారం ఉదయం సుధాకర్ ఇంటికి వచ్చేసరికి బీరువా తాళాలు తెరిచి ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్లూస్‌టీంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు దొంగతనం జరిగినట్లు గుర్తించారు. 45 తులాల బంగారం, 4 కిలోల వెండి, నగదు అపహరించారని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:జేబు దొంగల హల్చల్.. ప్రముఖుల కార్యక్రమాలే టార్గెట్!