తెలంగాణ

telangana

ETV Bharat / crime

Theft in jewellery shop : జ్యువెల్లరీ షాపులో దొంగతనం.. 5 కిలోల వెండి ఆభరణాలు మాయం - five kgs silver was theft

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లోని శ్రీగణేశ్ జ్యువెల్లరీ దుకాణం(Theft in jewellery shop)లో భారీ చోరీ జరిగింది. దుకాణం గోడకు కన్నం చేసిన దుండగులు.. దాని ద్వారా లోపలి చొచ్చుకుని వెళ్లి 5 కిలోల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.

5 కిలోల వెండి ఆభరణాలు మాయం
5 కిలోల వెండి ఆభరణాలు మాయం

By

Published : Sep 21, 2021, 9:11 AM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లోని శ్రీగణేశ్ జ్యువెల్లరీ దుకాణం(Theft in jewellery shop)లో భారీ దొంగతనం జరిగింది. దుకాణం గోడకు కన్నం చేసి దొంగలు లోనికి వెళ్లారు. బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లడానికి ప్రయత్నించారు. బంగారం లాకర్​లో ఉండటం వల్ల దుండగులు ఎత్తుకెళ్లలేకపోయారు. కానీ.. సుమారు 5 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు.

ఇవాళ ఉదయం దుకాణం(Theft in jewellery shop) తెరవడానికి వెళ్లిన యజమాని.. గోడకు కన్నం ఉండటం చూసి ఖంగుతిన్నాడు. వెంటనే షాపు తెరిచాడు. 5 కిలోల వెండి అభరణాలు లేకపోవడం చూసి దొంగలు పడ్డారని నిర్ధరణకు వచ్చాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగారు ఆభరణాలు లాకర్​లో పెట్టడం వల్లే అవి వాళ్లు ఎత్తుకెళ్లలేకపోయారని యజమాని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details