ఖమ్మం జిల్లా మధిర ప్రధాన రహదారిలో ఉన్న విఘ్నేశ్వర ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటాక గేటు తాళాన్ని పగలగొట్టి.. హుండీని తెరిచి నగదును దోచుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
మధిర విఘ్నేశ్వర ఆలయంలో చోరీ - తెలంగాణ వార్తలు
లాక్‌డౌన్ సమయంలో పోలీసులు రాత్రివేళల్లోనూ విస్తృతంగా పహారా నిర్వహిస్తున్నప్పటికీ అక్కడక్కడా చోరీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా మధిరలోని విఘ్నేశ్వర ఆలయంలో దొంగతనం జరిగింది. దుండగులు హుండీని తెరిచి నగదును దోచుకెళ్లారు.
Theft at Vigneshwara Temple, Madhira, Khammam District
హుండీలో రూ.50 వేలకు పైగానే భక్తులు సమర్పించిన కానుకలు ఉండి ఉంటాయని ఆలయ అర్చకులు రవిశాస్త్రి తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులు రాత్రివేళల్లోనూ విస్తృతంగా పహారా నిర్వహిస్తున్నప్పటికీ ప్రధాన వీధిలో ఉన్న ఆలయంలో చోరీ జరగడం పట్ల స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: భగ్గుమన్న పాత కక్షలు.. యువకుడికి తీవ్ర గాయాలు