తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెండు వస్త్ర దుకాణాల్లో దొంగల చేతివాటం.. 5 లక్షలు స్వాహా.. - నిజామాబాద్ తాజా క్రైమ్ వార్తలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు వస్త్ర దుకాణాల్లో దొంగతనం జరిగింది. దాదాపు 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

theft at two cloth stores in nizamabad
రెండు వస్త్ర దుకాణాల్లో దొంగల చేతివాటం

By

Published : May 22, 2021, 10:43 AM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గాంధీ చౌక్ ప్రాంతంలో గల సురేష్ క్లాత్, విట్టల్ క్లాత్ వస్త్ర దుకాణాల్లో శుక్రవారం దొంగతనం జరిగింది. లాక్​డౌన్ నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటలకే దుకాణాన్ని మూసివేసి వెళ్లిన యజమాని ఈరోజు ఉదయం వచ్చి చూసేసరికి షాపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా... వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి.

రెండు దుకాణాల్లోని లాకర్లలోంచి దాదాపు 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయంటూ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న వన్​టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటాని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

ABOUT THE AUTHOR

...view details