Theft in KVP House: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. రూ.46లక్షల విలువైన డైమండ్ నెక్లస్ కనిపించడం లేదంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఆయన సతీమణి సునీత రెండురోజుల క్రితం పిర్యాదు చేశారు. ఈనెల 11న సునీత డైమండ్ నెక్లస్ ధరించి ఫంక్షన్ వెళ్లారు. ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్లిన కాసేపటి తర్వాత నుంచి నెక్లస్ కనిపించడం లేదంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లోని పనిమనుషులపై సునీత అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ నేత ఇంట్లో భారీ చోరీ... ఏం దొంగిలించారంటే? - మాజీ ఎంపీ ఇంట్లో భారీ దొంగతనం
Theft in KVP House: హైదరాబాద్‌లోని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. రూ. 46లక్షల విలువైన డైమండ్ నెక్లస్ కనిపించట్లేదంటూ ఆయన భార్య బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రెండ్రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Theft in KVP House