తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైదరాబాద్​లో భారీ చోరీ.. 2 కిలోల నగలు, 25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు - Thieves target empty Dignity houses in Hyderabad

రాజీవ్​నగర్​లో భారీ చోరీ.. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
రాజీవ్​నగర్​లో భారీ చోరీ.. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

By

Published : Jan 13, 2022, 6:20 PM IST

Updated : Jan 13, 2022, 7:47 PM IST

18:15 January 13

భారీ చోరీ.. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

Theft In House: హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ వేళ దొంగలు అనుకున్నంత పనిచేశారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడ్డ దొంగలు సుమారు కోటి రూపాయల విలువైన ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన ఎస్‌ఆర్‌ నగర్ పోలీసు స్టేషన్‌ పరిధి రాజీవ్‌నగర్‌లోని శ్రీ సాయి నివాస్ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. ఆ ఇంట్లో నుంచి 2కిలోల బంగారు ఆభరణాలు, 4కిలోల వెండి ఆభరణాలు, 25లక్షల నగదును దోచుకెళ్లారు. బాధిత ఇంటి యజమాని శేఖర్‌ స్టాక్ మార్కెట్ వ్యాపారం చేస్తుండగా.. అతని భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

శంషాబాద్‌లో వీరికున్న ఓ ప్లాట్‌ను విక్రయించగా వచ్చిన డబ్బును ఇంటిలో పెట్టుకున్నారు. అదే విధంగా ఓ మిత్రుడు వీరి వద్ద దాచిపెట్టుకున్న 35లక్షల రూపాయలను మాత్రం దొంగలు ముట్టుకోలేదు. అవి భద్రంగానే ఉన్నాయి. వేరే గ్రామంలో ఉంటున్న శేఖర్ తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో శేఖర్ దంపతులు అక్కడకు వెళ్లారు. ఈ దంపతులు ఊరెళ్లారని గమనించి.. తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పశ్చిమ మండలం డీసీపీ జువెల్ డేవిడ్, పంజాగుట్ట ఏసీపీ గణేష్​, అడిషనల్ డీసీపీ ఇక్బాల్‌ సిద్దిఖీ, తదితర పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 13, 2022, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details