తెలంగాణ

telangana

ETV Bharat / crime

లైవ్​ వీడియో: డబ్బులు కింద పడ్డాయని చెప్పి... నగదు కాజేశారు!

ఓ విశ్రాంత హెచ్ఎంను ఇద్దరు దుండగులు ఏమార్చి నగదు తీసుకుని ఉడాయించారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

theft-at-chilakaluripeta-in-guntur-district
డబ్బులు కింద పడ్డాయని చెప్పి... నగదు కాజేశారు!

By

Published : Feb 17, 2021, 7:48 PM IST

డబ్బులు కింద పడ్డాయని చెప్పి... నగదు కాజేశారు!

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం ఎన్ఆర్​టీ సెంటర్​లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​లో రూ.35,000 డ్రా చేసి వస్తున్న ఓ విశ్రాంత హెడ్​మాస్టర్​ను.. దుండగులు ఏమార్చి నగదు దోచుకున్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. బాధితుడు ఆంజనేయులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చిలకలూరిపేట పట్టణం పురుషోత్తమ పట్నం గ్రామానికి చెందిన శారద ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం తోట ఆంజనేయులు బుధవారం ఎస్​బీఐ బ్యాంకులో నగదు డ్రా చేశాడు. సైకిల్ మీద పెట్టుకొని ఎన్ఆర్​టీ సెంటర్లో మున్సిపల్ కార్యాలయం మలుపు తిరుగుతున్నాడు. ఇది గమనించిన దుండగులు.. ఆంజనేయులు వద్దకు వచ్చి మీ డబ్బులు కింద పడ్డాయని చెప్పడంతో అతను సైకిలు పక్కనపెట్టి ఆ డబ్బులు తీసుకునేందుకు వెళ్లాడు. ఈలోగా మరో వ్యక్తి సైకిల్ మీద వెనుక స్టాండ్​పై ఉంచిన నగదు తీసుకొని ద్విచక్రవాహనంపై ఉడాయించారు.

ఇదీ చదవండి:డ్రగ్స్​ విక్రయానికి యత్నించిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details