భూ వివాదంలో ఓ వ్యక్తిని అతని తమ్ముడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలో జరిగింది.
భూ వివాదంలో అన్నను హతమార్చిన తమ్ముడు - rangareddy district latest news
రంగారెడ్డి జిల్లా టంగుటూరు గ్రామంలో దారుణం జరిగింది. భూ వివాదంలో ఓ తమ్ముడు అతని అన్ననే కిరాతకంగా హతమార్చాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
భూ వివాదంలో అన్నను హతమార్చిన తమ్ముడు
జిల్లాలోని టంగుటూరు గ్రామానికి చెందిన సురగళ్ల యాదయ్య (50), అతని తమ్ముళ్లు పాండు, రాజుల మధ్య కొంతకాలంగా భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మరోమారు గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన పాండు అతనిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయలపాలైన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
ఇదీ చదవండి:పాత నేరస్థుల ఇళ్లపై పోలీసుల దాడులు.. మారణాయుధాలు స్వాధీనం