Murder: విద్యార్థిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది - Ap crime news updates
20:29 June 18
Murder: విద్యార్థిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది
ఏపీలోని కడప జిల్లా బద్వేల్ మండలం చింతలచెరువు గ్రామంలో దారుణం జరిగింది. విద్యార్థినిని ఓ యువకుడు ఆమె ఇంటి వద్దే గొంతుకోసి హతమార్చాడు. దాడి చేసిన యువకుడు చరణ్‌ను గ్రామస్థులు పట్టుకుని చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన చరణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని కుటుంబ సభ్యులు బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థిని దారుణ హత్యకు సంబంధించిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: CM KCR: సర్పంచ్‌తో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్