ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో జరిగింది.
ప్రమాదవశాత్తు చెరువులో మునిగి యువకుడు మృతి - చిన్నశంకరంపేట మండలం వార్తలు
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చెందిన చిగుళ్లపల్లి వినయ్.. ఈత కొట్టేందుకు చెరువుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయాడని పోలీసులు తెలిపారు.
drowned in the pond, rudraram, medak
నార్సింగి మండల కేంద్రానికి చెందిన చిగుళ్లపల్లి వినయ్(20) ఈరోజు రుద్రారం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. సరదాగా ఈత కొట్టేందుకు చెరువుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. మృతుని తండ్రి నర్సింలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గౌస్ తెలిపారు.
ఇదీ చూడండి:ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన ఫొటో సరదా!