తెలంగాణ

telangana

ETV Bharat / crime

పొలంలోకి దూసుకెళ్లిన బైక్... యువకుడి మృతి - నిజామాబాద్​ రూరల్​ మండలంలో ద్విచక్రవాహనంపై నుంచి పడి యువకుడు మృతి

అతివేగం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ద్విచక్రవాహనం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లడంతో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ రూరల్​ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో జరిగింది.

The young man died with  fell down from the  bike in nizamabad rural mandal
అదుపుతప్పిన ద్విచక్రవాహనం.. యువకుడు మృతి

By

Published : Jan 28, 2021, 5:30 PM IST

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్​ రూరల్​ మండలం మల్కాపూర్ గ్రామశివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. బోర్గం గ్రామానికి చెందిన రాజేశ్, విక్రమ్​(25) అనే ఇద్దరు పనికోసం కమ్మర్​పల్లి వెళ్లి వస్తుండగా నిన్న రాత్రి బైక్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న విక్రమ్ ఎగిరి బండపై పడడంతో తలకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే తనువు చాలించాడు. మృతుని తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిజామాబాద్​ రూరల్​ ఎస్సై మధుసూదన్ గౌడ్​ తెలిపారు.

ఇదీ చూడండి :ఉద్యోగులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details