రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలోని గండిపేట్ చెరువులో.. అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి ముఖంపై తీవ్ర గాయాలు ఉండటంతో.. కుమారుడినెవరో హత్య చేసి ఉంటారని ఆరోపిస్తూ తల్లిదండ్రలు ఆవేదన వ్యక్తం చేశారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం - గండిపేట్ చెరువు
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలోని గండిపేట్ చెరువు వద్ద జరిగింది. మృతుడు ధన్వాడ గ్రామవాసిగా గుర్తించారు.
యువకుడు మృతి
ధన్వాడ గ్రామానికి చెందిన ప్రవీణ్ (19).. హోలీ పండుగ రోజు నుంచి కనిపించడం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతుడిది హత్యా..? లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రభుత్వ భూముల్లో.. విక్రయాలకు పాల్పడుతోన్న కేటుగాళ్ల అరెస్ట్