మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. అటవీశాఖ తనిఖీకేంద్రం వద్ద గేటు తగిలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. లాక్‌డౌన్ వేళ అధికారులు ఆపుతారనే భయంతో వేగంగా వెళ్లిన యువకుడు అతని మిత్రుడి మృతికి కారణమయ్యాడు.
లైవ్ వీడియో: మిత్రుని ప్రాణాలు తీసిన బైకర్ దుస్సాహసం
భయమో, అతి నమ్మకమో... ఓ వాహనదారుడు దుస్సాహసానికి ఒడిగట్టి ఒక ప్రాణం పోవటానికి కారణమయ్యాడు. పోలీసులు పెట్టిన గేటును ఆపకుండానే దాటుకుని పోవాలనే లక్ష్యంతో వెళ్లిన వాహనదారుడు... వెనకున్న మిత్రుని పరిస్థితి ఆలోచించలేకపోయాడు. ఈ అనాలోచిత, అవివేక చర్యతో విలువైన నిండు ప్రాణం క్షణంలో గాల్లో కలిసిపోయింది.
The young man died due to hit the check post gate at tapalapur
వాహనం దూరంగా ఉన్నప్పుడే అటవీ అధికారి వాహనాన్ని ఆపమని సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు. అదేమీ పట్టించుకోకుండా వేగంగా వచ్చిన వాహనదారుడు గేటు కింది నుంచి బైకును పోనిచ్చాడు. ఈ క్రమంలో ఆ వాహనదారుడు బయటపడగా... వెనకున్న వ్యక్తి మాత్రం గేటుకు బలంగా ఢీకొని కిందపడిపోయాడు. ఆ అధికారి ఎంత ప్రయత్నించినా కుప్పకూలిన ఆ యువకుడి విలువైన ప్రాణం కాపాడలేకపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి.
ఇదీ చూడండి: కుమారుడిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన తల్లి