తెలంగాణ

telangana

ETV Bharat / crime

సెల్​టవర్​ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం - సెల్​టవర్​ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం

ఖమ్మం జిల్లా మధిర పురపాలిక పరిధిలో ఓ యువకుడు సెల్​ టవర్​ ఎక్కి హల్​చల్​ చేశాడు. రెవెన్యూ అధికారులు తనకు ధ్రువీకరణపత్రం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

suicide attempt at cell tower
సెల్​టవర్​ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం

By

Published : Feb 25, 2021, 11:12 AM IST

ఖమ్మం జిల్లా మధిర పురపాలికలోని దిడుగుపాడు గ్రామంలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్​చల్​ చేశాడు. రెవెన్యూ అధికారులు తనకు ధ్రువీకరణపత్రం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించాడు. గ్రామానికి చెందిన రమేష్ ఇటీవల కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రోజుల తరబడి సర్టిఫికెట్​ ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్​టవర్​ ఎక్కాడు.

సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రమేష్​ బెదిరింపులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడితో ఫోన్​లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.

సెల్​టవర్​ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి:బెల్టుషాప్​లో మర్డర్.. పాతకక్షలే కారణం..!

ABOUT THE AUTHOR

...view details