కుటుంబ కలహాలతో భర్తను... భార్య కిరాతకంగా హతమార్చింది. ఈ ఘోర ఘటన మంచిర్యాల జిల్లాకేంద్రంలోని సాయికుంట కాలనీలో చోటుచేసుకుంది. అదే కాలనీకి చెందిన కొప్పుల నాగరాజు నిత్యం తన భార్యను వేధించేవాడని స్థానికులు తెలిపారు. భర్త వేధింపులతో విసుగు చెందిన ఆమె గతరాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో అతడి తలపై కత్తితో దాడి చేసి అంతమొందించింది.
Murder: భర్తను కిరాతకంగా హతమార్చిన భార్య - తెలంగాణ వార్తలు
మంచిర్యాల జిల్లాకేంద్రంలో భర్తను భార్య హతమార్చింది. తన భర్త వివాహేతర సంబంధం కారణంగానే తమ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని పేర్కొంది. భర్త వేధింపులు తట్టుకోలేకనే హత్య చేసినట్లు ఆమె తెలిపింది.
హత్య, భర్తను హత్య చేసిన భార్య
అనంతరం ఆమె మంచిర్యాల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. తన భర్త వివాహేతర సంబంధం కారణంగానే తమ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని... ఆ విషయంపై సహించకనే తానే హతమార్చినట్లు తెలిపింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Ganja seized: 10 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్