Missing students found alive: పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి మేడ్చల్ జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ లభ్యమైంది. శనివారం సాయంత్రం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా బహదూర్‌పల్లి, దూలపల్లి వైపు వెళ్లినట్లు గుర్తించారు. ముమ్మరంగా గాలిస్తున్న క్రమంలో నేడు(ఆదివారం) బాలికలే నేరుగా ఇంటికి ఇచ్చారు. పిల్లలు క్షేమంగా తిరిగిరావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఏం జరిగింది?
మేడ్చల్ జిల్లా సూరారం కాలనీకి చెందిన గాయత్రి(15), మౌనిక(15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. రోజూ లాగే శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థినీలు... సాయంత్రమైన ఇంటికి రాలేదు. పలుమార్లు అదనంగా ప్రైవేట్ క్లాసులు ఉన్నయంటూ ఆ బాలికలు ఒక గంట ఆలస్యంగా ఇంటికి వెళ్తుండేవారు. కానీ శనివారం మాత్రం రాత్రి 7 దాటినా ఇంటికి రాకపోవడంతో వారి పాఠశాల, పరిసర ప్రాంతాల్లో ఆచూకీ కోసం బాలికల తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు.