తెలంగాణ

telangana

ETV Bharat / crime

నిర్మాత కారును దొంగలించిన దుండగులు - నిర్మాత కారును దొంగలించిన దుండగులు

బంజారాహిల్స్‌లోని పార్క్ హయ‌త్ హోట‌ల్‌లో నిర్మాత మంజునాథ్ కారును గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. కారులో విలువైన ద‌స్తావేజుల‌తోపాటు చెక్కు బుక్‌లు, త‌న బెంజి కారు తాళాలు ఉన్నాయంటూ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిర్మాత ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

thugs stole the producer's car at the Park Hyath Hotel
నిర్మాత కారును దొంగలించిన దుండగులు

By

Published : Jan 29, 2021, 10:20 PM IST

బంజారాహిల్స్‌లోని పార్క్ హయ‌త్ హోట‌ల్‌లో నిర్మాత మంజునాథ్ కారును గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ నెల 26న రాత్రి 9.30 గంట‌ల‌కు కారును హోట‌ల్ బేస్‌మెంట్ 2లో నిలిపినట్లు డ్రైవ‌ర్‌ హ‌ర్ష‌ తెలిపారు.

27 ఉదయం కారు క‌నిపించ‌క‌పోవ‌డంతో 28న బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంజునాథ్ ఫిర్యాదు చేశారు. కారులో విలువైన ద‌స్తావేజుల‌తోపాటు చెక్కు బుక్‌లు, ఐడీ కార్డులు, స్మార్ట్ కార్డులు, త‌న బెంజి కారు తాళాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:మెగాస్టార్​ 'ఆచార్య' టీజర్​ వచ్చేసిందోచ్​!

ABOUT THE AUTHOR

...view details