ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడి రూ.లక్ష నగదు, మూడు తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో చోటుచేసుకుంది. పటాన్చెరు సాయిరామ్ కాలనీలోని 3, 6 ,7 నంబర్ల రహదారిలో ఉన్న మూడు ఇళ్లలో దొంగలు గడియలు పగలగొట్టి చోరీకి యత్నించారు. ఒక ఇంట్లో సొత్తు ఎత్తుకెళ్లారు.
ఒకే కాలనీలోని మూడు ఇళ్లల్లో చోరీ.. - Sangareddy District Latest News
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో దొంగతనం జరిగింది. ఒకే కాలనీలో మూడు ఇండ్లల్లో చోరీకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే కాలనీలోని మూడు ఇళ్లల్లో చోరీ..
మహమూద్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో రూ.లక్ష నగదు, మూడు తులాల బంగారం దొంగిలించారు. ఇంటి యజమానులు బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం సీసీ పుటేజిని పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి:పట్టపగలే న్యాయవాది దారుణ హత్య