ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బతండలో జరిగిన ఓ దొంగతనం చర్చనీయాంశంగా మారింది. చోరీకి గురైన కొంత డబ్బు మళ్లీ బాధితుని ఇంటి ఆవరణలో దొరికింది. లచ్చిరాం అనే రైతు తన పంటను అమ్మగా రూ.1.7 లక్షలు వచ్చాయి. వాటితో బ్యాంకులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలనుకుని ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టాడు.
దొంగకు జాలి పుట్టిందా.. లేదా భయం వేసిందా..! - పట్టపగలే దొంగతనం
ఓ దొంగ పట్టపగలే భారీగా నగదు చోరీ చేశాడు. ఆ తరువాత అతనికి జాలి పుట్టిందో లేదా.. పోలీసుల దర్యాప్తులో దొరికిపోతనని భయం వేసిందో తెలియదు కానీ దొంగలించిన సగం డబ్బును బాధితుని ఇంటి ఆవరణలో వేసి వెళ్లాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బతండలో చోటుచేసుకుంది.
పొలం పనులు చూసుకుని ఇంటికి వచ్చేసరికి పట్టపగలే దొంగలు బీరువాలోని డబ్బును దోచుకెళ్లారు. రైతు కుటుంబం కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సురేశ్ బాధితుని ఇంటి ఆవరణలో డాగ్ క్లూస్ టీంతో పరిశీలించారు. దీంతో ఆ దొంగలకు జాలి పుట్టిందో లేదా.. పోలీసుల దర్యాప్తులో దొరికిపోతనని భయం వేసిందో తెలియదు కాని దొంగలించిన డబ్బులోని రూ.1 లక్ష లచ్చిరాం ఇంటి ఆవరణలో వేసి వెళ్లారు. వాటిని చూసిన కుటుంబ సభ్యులు అవాక్కై... ఆ విషయాన్ని పోలీసులకు తెలిపారు. మిగతా సొమ్ము కూడా దొరుకుతుందా లేక దొంగలే దొరుకుతారా అని స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి:అర్ధనగ్నంగా హిజ్రాల హల్చల్.. అడిగినంత డబ్బివ్వాలని డిమాండ్