హైదరాబాద్ పాతబస్తీలో భవానీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తలబ్కట్ట వద్ద ఓ ఇంటిపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. డీసీపీ గజారావు భూపాల్ జాయింట్ ఆపరేషన్ చేసి.. రాజస్థాన్ నుంచి తల్వార్లు తీసుకొచ్చి హైదరాబాద్‌లో అధిక ధరలకు అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
దాడుల్లో మహమ్మద్ సల్మాన్, మహమ్మద్ జావిద్‌ల నుంచి 5 తల్వార్లు, 3 జాంబియాలు సీజ్ చేశారు. వాటిని భవానీ నగర్ పోలీసులకు అప్పగించారు.