తెలంగాణ

telangana

ETV Bharat / crime

దారుణం: తండ్రిని పొడిచి చంపిన తనయుడు - కత్తితో పొడిచి హత్య

ఎదిగిన కొడుకు ఏ పనీ చేయకుండా తిరుగుతున్నాడని.. తండ్రి అతనిని మందలించాడు. పనీపాటా లేక ఖాళీగా తిరిగేబదులు.. తనతో పొలానికి రావాల్సిందిగా కోరాడు. మాటిమాటికీ ఎందుకు తిడతావంటూ తిరగబడ్డాడు అతని కొడుకు. రెచ్చిపోయి.. కన్న తండ్రి అని కూడా చూడకుండా కత్తితో పొడిచాడు. ఈ దారుణం నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో చోటుచేసుకుంది.

son murdered father
తండ్రిని చంపిన తనయుడు

By

Published : Apr 21, 2021, 5:51 PM IST

మాటిమాటికీ తిడుతున్నాడన్న కోపంతో.. ఓ తండ్రిపై కుమారుడు కత్తితో దాడి చేశాడు. ఆసరాగా నిలవాల్సింది పోయి.. అతనిని హతమార్చాడు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో చోటుచేసుకుంది.

పాములపాడుకు చెందిన ఎల్లయ్య (43).. రోజూ మాదిరిగానే పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. చేదోడు వాదోడుగా ఉండాలంటూ.. నాగరాజు(17)ను కోరాడు. తనతో పొలానికి రావాల్సిందిగా సూచించాడు. అందుకు అంగీకరించని కొడుకుని మందలించాడు. మాట మాట పెరగడంతో ఆవేశానికి లోనైన నాగరాజు.. తండ్రిని కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ఎల్లయ్యను ఆస్పత్రి తరలిస్తుండగా.. అతను మార్గమధ్యలోనే చనిపోయాడు.

తండ్రిని పొడిచి పారిపోతున్న నాగరాజును.. గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడికి అప్పుడప్పుడు మతిస్తిమితం సరిగా ఉండదని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:కుమార్తెతో సహా ఎస్సారెస్పీలో దూకి మహిళ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details