దిశ హత్యాచార కేసులో(disha rape and murder case)జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. పలువురు సాక్షులను కమిషన్(disha case details in telugu) ప్రశ్నిస్తోంది. ఇప్పటికే సిట్ ఛైర్మన్ మహేష్ భగవత్‌నుప్రశ్నించిన కమిషన్.. మరోసారి ఆయనను విచారించింది. నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంది. ఎన్‌కౌంటర్(hyderabad disha encounter case) జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్‌ను(disha encounter sajjanar) ఈ నెల 29న విచారించనుంది. ఇందులో భాగంగా దర్యాప్తు అధికారి సురేందర్‌రెడ్డిని కమిషన్ ప్రశ్నించింది. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించిన కమిషన్... ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై ఆరా తీసింది.
అపూర్వారావును ప్రశ్నించిన కమిషన్
‘దిశ’ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనలో పాల్గొన్న పోలీసులు వినియోగించిన తూటాల లెక్క తేల్చేందుకు సంబంధిత ఠాణాల్లోని ఆయుధాల రిజిస్టర్‌ను తనిఖీ చేశారా? అని వనపర్తి ఎస్పీ అపూర్వారావును సిర్పుర్కర్ కమిషన్ ఇదివరకే ప్రశ్నించింది. తనిఖీ చేయలేదని ఆమె బదులిచ్చారు. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ ఘటనపై ఏర్పాటైన సిట్‌కు సంబంధించి కేస్ డైరీ రాసిన అపూర్వారావును కమిషన్ ఇప్పటికే విచారించింది.
ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై ఆరా
ఎన్‌కౌంటర్‌లో(disha encounter case) గాయపడినట్లుగా చెబుతున్న పోలీసులకు చికిత్స చేసిన ఆసుపత్రిని సందర్శించిన సమయంలో క్షతగాత్రులు ఐసీయూలో ఉన్నారా? సాధారణ వార్డులో ఉన్నారా అని ప్రశ్నించగా.. సాధారణ వార్డులోనే ఉన్నారని ఆమె బదులిచ్చారు. తీవ్రమైన గాయాలతో ఉన్నారని సిట్ నివేదికలో ఉందని.. అలాంటి వారిని సాధారణ వార్డులో ఎలా ఉంచారని కమిషన్ సభ్యులు ప్రశ్నించారు. ఐసీయూ, ఐసీసీయూ, సాధారణ వార్డులకు తేడా తెలుసా అని అసహనం వ్యక్తం చేశారు.